బీసీసీఐ లేకుంటే ఐసీసీ లేదు

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-27 03:47:00

-కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్
హమీర్‌పూర్(హిమాచల్ ప్రదేశ్): బీసీసీఐ సాయం లేకుంటే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మనుగడ ఎక్కడిదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఐసీసీ నిర్వహణకు బీసీసీఐ 75 శాతం నిధులు అందజేస్తున్నదని గుర్తు చేశారు. శనివారం ఇక్కడ జరిగిన ఖేల్ మహాకుంభ్ టోర్నీ బహుమతుల ప్రదాన కార్యక్రమంలో అనురాగ్ మాట్లాడారు. నిర్వహణ కోసం 75 శాతం నిధులు ఇస్తున్న బీసీసీఐ లేకుంటే ఐసీసీ మనుగడ లేదు. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని నూతన పాలకవర్గం.. ఐసీసీ నుంచి బోర్డుకు రావాల్సిన బకాయిలను వసూలు చేస్తుందని ఆశిస్తున్నా. బీసీసీఐ కోశాధికారిగా నియమితుడైన నా సోదరుడు అరుణ్ నిజాయితీతో విధులు నిర్వహిస్తారని నమ్ముతున్నా అని అనురాగ్ చెప్పారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN