బీసీసీఐ సంచలన నిర్ణయం : ఐపీఎల్ ప్రారంభ వేడుకలు రద్దు
ప్రతీ సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే ఐపీఎల్ వేడుకలకు ఎంతో మంది ప్రముఖులు, సెలెబ్రిటీలు, చాలా వరకు హాజరవుతారు. ఈమేరకు వేడుకల్లో బాణాసంచా, వారు సృష్టించే హంగామా మాములుగా ఉండదు. అయితే ఈమేరకు బీసీసీఐ ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుందని చెప్పాలి. ఇక నుండి ఐపీఎల్ ఆరంభ వేడుకలను రద్దు చేయాలని, ఆ వేడుకలకు అయ్యే ఖర్చుని ఆపేయాలని నిర్ణయం తీసుకుంది. అదంతా అనవసరమైన ఖర్చుగా భావించిన బీసీసీఐ, దానితో పాటే బాణాసంచా వలన కాలుష్యం పెరిగిపోతుందని, అందుకనే ఇకనుండి ఈ ప్రారంభ వేడుకలను జరపకూడదని నిర్ణయించుకుంది.
ఇకపోతే 2019 ఐపీఎల్ 10 సీజన్‌కు సంబంధించిన వేడుకలను కూడా రద్దు చేసి, అందుకు అవసరమైన నిదులని బీసీసీఐ ప్రభుత్వానికి అందజేసింది కూడా. అయితే అందులో రూ.11 కోట్లను భారత ఆర్మీకి, రూ.7 కోట్లు సీఆర్పీఎఫ్కు, రూ.1 కోటి నేవీ కి, రూ.1 కోటి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు అందజేసింది. మొత్తానికి రూ.20 కోట్ల రూపాయలని బీసీసీఐ అందజేసింది.