బుమ్రా కు .. ఫిట్నెస్ సమస్య..

Navyamedia

Navyamedia

Author 2019-05-17 23:59:14

img

దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు మ్యాచ్‌లకు టీమిండియా ఫేసర్ జస్ప్రిత్ బుమ్రా దూరం కానున్నాడు. నడుం భాగంలో గాయం కారణంగా టెస్టు ఫార్మాట్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ అతని స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను తీసుకోనున్నట్లు ప్రకటించింది. సఫారీలపై భారత టెస్టు సిరీస్ వైజాగ్ వేదికగా అక్టోబరు 2వ తేదీ నుంచి ఆరంభం కానుంది. బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ‘బుమ్రా గాయానికి గురికావడంతో రేడియోలాజికల్ స్క్రీనింగ్ నిర్వహించాం. ప్రస్తుతం బుమ్రా బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో ఘతపతామగ. అతని స్థానంలో ఉమేశ్ యాదవ్ ఆడతాడని ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది’ అని తెలిపారు. ఉమేశ్ యాదవ్ 2018 డిసెంబరులో ఆస్ట్రేలియా జట్టుతో ఆడాడు. అతని కెరీర్లో 41మ్యాచ్‌లు ఆడిన ఉమేశ్.. 119వికెట్లు పడగొట్టగలిగాడు. భారత్ వర్సెస్ సఫారీల టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ అక్టోబరు 2న, రెండో టెస్టు మ్యాచ్ అక్టోబరు 10న, మూడో టెస్టు మ్యాచ్ అక్టోబరు 19న జరగనున్నాయి.

భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పూజారా, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), హనుమ విహారీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజే , మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, ఇశాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్.READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN