బుమ్రా, మంధనకు విజ్డెన్ అవార్డు

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-26 06:08:00

img
బెంగళూరు : ప్రతిష్ఠాత్మక విజ్డెన్ ఇండియా అల్మానక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహిళా జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధన దక్కించుకున్నారు. మొత్తం ఐదుగురికి ఈ అవార్డులను శుక్రవారం ప్రకటించారు. ఆఫ్ఘనిస్థాన్ స్టార్ రషీద్ ఖాన్, శ్రీలంక బ్యాట్స్‌మన్ దిముత్ కరుణరత్నె, పాకిస్థాన్ ఆటగాడు ఫఖర్ జమాన్ ఈ అవార్డులకు ఎంపికయ్యారు. కాగా, మిథాలీ రాజ్, దీప్తి శర్మ తర్వాత ఈ పురస్కారాన్ని దక్కించుకున్న భారత మూడో మహిళా క్రికెటర్‌గా స్మృతి నిలిచింది. జాతీయ జట్టు, దేశవాళీల్లో పరుగుల వరద పారిస్తున్న మయాంక్ అగర్వాల్‌కు కూడా తన ఏడో వార్షిక ప్రచురణ 2019-20లో విజ్డెన్ చోటు కల్పించింది. అలాగే విజ్డెన్ ఇండియా హాల్ ఆఫ్ ఫేమ్‌లో క్రికెట్ దిగ్గజాలు లాలా అమర్‌నాథ్, గుండప్ప విశ్వనాథ్‌ను చేర్చింది. ప్రశాంత్ కిడాంబి రాసిన క్రికెట్ కంట్రీ : ది అన్‌టోల్డ్ హిస్టరీ ఆఫ్ ది ఫస్ట్ ఆల్‌ఇండియా టీమ్ పుస్తకం విజ్డెన్ బుక్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN