బుమ్రా, మంధానాకు విజ్డన్‌ పురస్కారాలు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-26 05:12:22

img

బెంగళూరు: భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, బ్యాట్స్‌వుమన్‌ స్మృతి మంధానా ప్రతిష్ఠాత్మక విజ్డన్‌ పురస్కారాలకు ఎంపికయ్యారు. విజ్డన్‌ ఇండియా అల్మనాక్‌ ‘క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’ను బుమ్రా, స్మృతి గెలుచుకున్నారు. ఈ అవార్డు కోసం శుక్రవారం ప్రకటించిన ఐదుగురు ఆసియా విజేతల్లో ఇద్దరు మనోళ్లే ఉండడం విశేషం. మిగతా ముగ్గురు పాకిస్థాన్‌ క్రికెటర్‌ ఫఖర్‌ జమాన్‌, శ్రీలంకకు చెందిన దిముత్‌ కరుణరత్నె, అఫ్ఘానిస్థాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌. కాగా.. భారత యువ క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ పేరు కూడా విజ్డెన్‌ సంచికకెక్కింది. 2019, 2020కి గాను ఏడో ఎడిషన్‌ వార్షిక క్రికెట్‌ సంచికల్లో మయాంక్‌ అగర్వాల్‌కు సంబంధించి ప్రత్యేక కథనం ముద్రించారు. దక్షిణాఫ్రికాతో ఇటీవలే ముగిసిన టెస్టు సిరీస్‌లో మయాంక్‌ డబుల్‌ సెంచరీతో విజృంభించిన సంగతి తెలిసిందే. కాగా.. మిథాలీ రాజ్‌, దీప్తి శర్మ తర్వాత విజ్డన్‌ అవార్డుకు ఎంపికైన మూడో భారత మహిళా క్రికెటర్‌ స్మృతి. భారత మాజీలు గుండప్ప విశ్వనాథ్‌, లాలా అమర్‌నాథ్‌ విజ్డన్‌ ఇండియా హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN