బుమ్రా యాక్షన్‌ మార్చుకోనక్కర్లేదు

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-30 05:47:00

img
న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వెన్నునొప్పికి అతడి వైవిధ్యమైన బౌలింగ్‌ యాక్షనే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. గాయాలకు యాక్షన్‌కు సంబంధం ఉండదని మాజీ స్టార్‌ పేసర్‌ అశీష్‌ నెహ్రా పేర్కొన్నాడు. బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ మార్చుకోవాల్సిన అవసరమే లేదని, త్వరలోనే అతడు గాయం నుంచి కోలుకుంటాడని నెహ్రా అన్నాడు. ‘బౌలింగ్‌ యాక్షన్‌ వల్ల వెన్నునొప్పి రాదు. బుమ్రా యాక్షన్‌ను మార్చుకోకూడదు. అలా ప్రయత్నిస్తే సరైన ఫలితాలు రాకపోవచ్చు. అదే యాక్షన్‌, తీవ్రత, పేస్‌తో మళ్లీ బౌలింగ్‌ చేయాలి. అతడి యాక్షన్‌ మరీ అసహజంగా ఉండదు. బాల్‌ విసిరేటప్పుడు అతడి శరీరం పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. మలింగ కన్నా బుమ్రా యాక్షన్‌ 10 రెట్లు మెరుగ్గా ఉంటుంది’ అని నెహ్రా అభిప్రాయపడ్డాడు. వెన్నునొప్పి ఇన్ని రోజుల్లో నయమవుతుందని కచ్చితంగా చెప్పలేమని, ఉపశమనం కలిగినట్టు ఆటగాడే గుర్తించాలని చెప్పాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD