బెంగళూరును నిలువరించిన నార్త్‌ఈస్ట్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-22 05:31:05

బెంగళూరు: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో డిఫెండింగ్‌ చాంపి యన్‌ బెంగళూరుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. గోల్స్‌ వర్షం కురుస్తుందనుకుంటే ఒక్కగోల్‌ కూడా నమోదవలేదు. సోమవారం బెంగళూరు, నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీ మధ్య మ్యాచ్‌ 0-0తో డ్రాగా ముగిసింది. ఇరుజట్లూ నువ్వా నేనా అన్నట్టు పోరాడడంతో ఫస్టాప్‌ గోల్‌ లెస్‌గా ముగిసింది. సెకండా్‌ఫలో దూకుడు పెంచిన బెంగళూరు ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఒత్తిడికి గురి చేసింది. అయితే, 65వ నిమిషంలో నిషు కుమార్‌ కొట్టిన షాట్‌ను నార్త్‌ఈస్ట్‌ కీపర్‌ సుభాషిష్‌ అద్బుతంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఇరుజట్లూ గోల్‌ కోసం ప్రయత్నించినా సఫలం కాలేకపోయాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD