బెన్‌ స్టోక్స్‌కు అరుదైన గౌరవం

Nava Telangana

Nava Telangana

Author 2019-10-03 17:31:00

హైదరాబాద్: ఇటీవల జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ విశ్వ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాదిగాను ఇంగ్లండ్‌-వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ఇచ్చే ఫ్రొఫెషనల్‌ క్రికెటర్ల అసోషియేషన్‌(పీసీఏ)అవార్డును స్టోక్స్‌ దక్కించుకున్నాడు. ఈ మేరకు స్టోక్స్‌కు పీసీఏ అవార్డును కైవసం చేసుకున్నట్లు ఈసీబీ తెలిపింది. ప్రధానంగా వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో స్టోక్స్‌ ముఖ్య భూమిక పోషించాడు. మరొకవైపు యాషెస్‌ సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో కూడా స్టోక్స్‌ది ప్రధాన పాత్ర.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN