బైల్స్‌ కళ్లు చెదిరే విన్యాసం

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-07 06:57:40

img

స్టట్‌గార్ట్‌: అమెరికా జిమ్నాస్టిక్స్‌ క్వీన్‌ సిమోనా బైల్స్‌.. వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో అద్భుత విన్యాసంతో చరిత్ర సృష్టించింది. బరిలోకి దిగిన తొలి మెగా ఈవెంట్‌లోని ఫ్లోర్‌ విన్యాసంలో అనితరసాధ్యమైన రీతిలో ‘ట్రిపుల్‌ ట్విస్టింగ్‌ డబుల్‌ బ్యాక్‌’ స్కిల్‌తో ఊపేసింది. వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో టీమ్‌ ఈవెంట్‌ ఫ్లోర్‌ విభాగం క్వాలిఫికేషన్‌లో ఆమె చేసిన అరుదైన ఫీట్‌ను ‘బైల్స్‌ 2’గా పిలుచుకుంటున్నారు. బీమ్‌ విన్యాసం ఆఖర్లో ఆమె చేసే డబుల్‌ ట్విస్టింగ్‌ డబుల్‌ టక్‌ ఫీట్‌ ‘ది బైల్స్‌’గా ప్రాచుర్యంలో ఉంది. ఇప్పుడు మరో అద్భుత విన్యాసంతో జిమ్నాస్టిక్స్‌లో అరుదైన మరో ఫీట్‌ను ఆమె సొంతం చేసుకుంది. మొత్తం 4 విన్యాసాలు 22 ఏళ్ల బైల్స్‌ పేరిట ఉన్నాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD