బైల్స్ రికార్డు పతకం
స్టట్గార్డ్: జిమ్నాస్టిక్స్ క్వీన్ సిమోనా బైల్స్ అద్భుత ప్రదర్శనతో వరల్డ్ చాంపియన్‌షి్‌పలో అమెరికా వరుసగా ఐదోసారి టీమ్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. టీమ్ ఆల్‌రౌండ్ ఈవెంట్లో అమెరికా బృందం 172.330 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. రష్యా, ఇటలీ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. బైల్స్ రికార్డు స్థాయిలో 15వ వరల్డ్ చాంపియన్‌షి్‌పలో పసిడిని సొంతం చేసుకుంది. మొత్తంగా 21 పతకాలతో రష్యాకు చెందిన సెత్లీనా ఖోర్కీనా రికార్డును బైల్స్ అధిగమించింది. ఆల్‌టైమ్ రికార్డు (23) హోల్డర్ విటాలి స్కెహర్బో (బెలార్‌స)కు రెండు పతకాల దూరంలో ఉంది.