బౌలర్ సరికొత్త చెత్త రికార్డు..!

Ntvtelugu

Ntvtelugu

Author 2019-10-28 14:40:35

img

క్రికెట్ అన్నప్పుడు అందరికీ అందనంత అద్భుతమైన రికార్డులే కాదు.. పరమ చెత్త రికార్డులు కూడా ఉంటాయి.. తాజాగా, అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డు సృష్టించాడు శ్రీలంక యువ ఫాస్ట్ బౌలర్ కసున్ రజిత. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రజిత.. ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 75 పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా సరికొత్త చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న శ్రీలంకకు ఆసీస్ ఓపెనర్లు ఆరోన్ ఫించ్‌, డేవిడ్ వార్నర్ చుక్కులు చూపించారు. అనంతరం వచ్చిన మాక్స్‌వెల్‌ కూడా విధ్వంసం సృష్టంచాడు. దీంతో 20 ఓవర్లకు 233 పరుగులు చేసింది ఆసీస్. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 9 వికెట్లు కోల్పోయి కేవలం 99 పరుగులు మాత్రమే చేయగలిగింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN