భయపెట్టిన నయీమ్ అవుట్

Nava Telangana

Nava Telangana

Author 2019-11-04 00:13:00

న్యూఢిల్లీ: లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ మరో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ లిటన్‌దాస్‌ను వెనక్కి పంపిన దీపక్ చాహర్.. మరో ఓపెనర్ మహ్మద్ నయీమ్‌ను పెవిలియన్ పంపాడు. క్రీజులో కుదురుకున్నట్టు కనిపించిన నయీమ్ 28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 26 పరుగులు చేశాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కాగా, 10 ఓవర్లు పూర్తయ్యే సరికి బంగ్లాదేశ్ రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. రహీం 7, సౌమ్య సర్కార్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ విజయానికి ఇంకా 60 బంతుల్లో 87 పరుగులు అవసరం. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD