భారత్‌కు నాలుగో స్థానం అవసరం లేదు

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-01 03:15:00

- యువరాజ్ సెటైర్
img
న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ మద్దతిచ్చి ఉంటే ఇంకో ప్రపంచకప్ ఆడి ఉండేవాడినని ఇటీవలే అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. మరోసారి తనదైన శైలిలో సెటైర్ వేశాడు. దేశవాళీ టోర్నీల్లో ఎన్ని పరుగులు చేస్తున్నా సూర్యకుమార్ యాదవ్‌ను టీమ్‌ఇండియాలోకి ఎందుకు తీసుకోవడం లేదంటూ మాజీ స్పిన్నర్ హర్భజన్ చేసిన ట్వీట్‌కు యువీ సోమవారం స్పందించాడు. నాలుగో స్థానం అత్యంత బలంగా ఉండడం టీమ్‌ఇండియాకు అవసరం లేదంటూ కామెంట్ చేశాడు. ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో ముంబై తరఫున సూర్య కుమార్ యాదవ్ 31 బంతుల్లో 81 పరుగులు చేసిన సందర్భంగా హర్భజన్ స్పందించాడు. దేశవాళీ క్రికెట్‌లో ధారాళంగా పరుగులు చేస్తున్నా సూర్యకుమార్ యాదవ్ టీమ్‌ఇండియాకు ఎందుకు ఎంపిక కావడంలేదో నాకు తెలియట్లేదు. సూర్య నువ్వు ఇంకా కష్టపడు.. నీ సమయం వస్తుంది అని టర్బోనేటర్ ట్వీట్ చేశాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN