భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈరోజే తొలి టీ20

Telangana News

Telangana News

Author 2019-11-03 12:45:01

imgThird party image reference

భారత్ గడ్డపై బంగ్లాదేశ్ పర్యటన ఆదివారం నుంచి ప్రారంభమవుతోంది. ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్ల) స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో మొత్తం మూడు టీ20లు, రెండు టెస్టులు జరగనుండగా.. బంగ్లాదేశ్ అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ నిషేధం కారణంగా సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. మరోవైపు భారత్ కూడా టీ20ల్లో విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చి ఓపెనర్ రోహిత్ శర్మ చేతికి పగ్గాలిచ్చింది.

ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. ఈ సిరీస్ నుంచి టోర్నీ సన్నద్ధతని ప్రారంభించాలని టీమిండియా యోచిస్తోంది. ఈ మేరకు జట్టులో మార్పులు చోటుచేసుకోగా.. శివమ్ దూబే లాంటి పవర్ హిట్టర్‌‌కి చోటు దక్కింది. అలానే బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కి మరో అవకాశమిస్తారా..? లేదా సంజు శాంసన్‌కి ఫస్ట్ ఛాన్సిస్తారా..? అనేదానిపై స్పష్టత రావడం లేదు.

రికార్డుల పరంగా చూసుకుంటే టీ20ల్లో బంగ్లాదేశ్‌పై పూర్తి స్థాయిలో భారత్ ఆధిపత్యం చెలాయించింది. ఇప్పటి వరకు మొత్తం 8 టీ20ల్లో ఈ రెండు జట్లు తలపడగా.. అన్నింటిలోనూ టీమిండియాదే విజయం. అయితే.. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇప్పటి వరకూ టీ20ల్లో తలపడిన ఈ రెండు జట్లు తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌లో ఢీకొనబోతున్నాయి. ఇక అరుణ్ జైట్లీ స్టేడియంలో 2017లో చివరిగా టీ20 మ్యాచ్ ఆడిన భారత్.. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో గెలుపొందింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD