భారత్-బంగ్లా మధ్య తొలి డే-నైట్‌ టెస్టు మ్యాచ్‌

Nava Telangana

Nava Telangana

Author 2019-10-30 14:07:00

హైద‌రాబాద్‌: భారత క్రికెట్ చరిత్రలో మరో అరుదైన ఘట్టానికి ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా నవంబర్ 22-26 మధ్య ఇక్కడ జరుగనున్న రెండో టెస్టు మ్యాచ్‌ను టీమ్‌ఇండియా గులాబీ బంతితో ఆడనుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగేండ్ల క్రితమే తొలి డే అండ్ నైట్ టెస్టు జరిగినా.. భారత్ మాత్రం ఫ్లడ్ లైట్‌ల కింద ఆడేందుకు ఇన్నాళ్లు ససేమీరా అంటూ వచ్చింది. సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పీఠం అధిరోహించాక కెప్టెన్ కోహ్లీతో ఈ అంశంపై చర్చించాడు. దీనికి విరాట్ సమ్మతం తెలపడంతో బంతి దాదా కోర్టుకు చేరింది. బెంగాల్ టైగర్ స్వయంగా బంగ్లా క్రికెట్ బోర్డుకు లేఖ రాయడంతో పాటు వారితో డే నైట్ టెస్టుకు ఓకే అనిపించాడు. దీంతో గత వారం రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడినైట్లెంది.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN