భారత జిమ్నా్‌స్టలకు నిరాశ

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-07 05:25:26

స్టట్‌గార్ట్‌ (జర్మనీ): ప్రపంచ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత జిమ్నా్‌స్టలు నిరాశ పరిచారు. ఆదివారం బరిలోకి దిగిన ముగ్గురు పోటీదారుల్లో ఒక్కరు కూడా ఫైనల్‌ చేరలేకపోయారు. మహిళల ఆల్‌రౌండ్‌ క్వాలిఫికేషన్స్‌లో ప్రణతి నాయక్‌ 45.832 పాయింట్లు స్కోరు చేయగా, ప్రణతి దాస్‌ 45.248 పాయింట్లు స్కోరు సాధించింది. వీళ్లిద్దరూ వరుసగా 127వ, 132వ స్థానాల్లో నిలిచారు. వాల్ట్‌ ఈవెంట్‌ క్వాలిఫికేషన్స్‌లో ప్రణతి నాయక్‌ 14.200 పాయింట్లతో 27వ స్థానంతో సరిపెట్టుకుంది. అన్‌ ఈవెన్‌ బార్స్‌ క్వాలిఫికేషన్స్‌ రౌండ్‌లోనూ విఫలమవుతూ ప్రణతి నాయక్‌, ప్రణతి దాస్‌, తెలుగమ్మాయి అరుణా రెడ్డి వరుసగా 164, 182, 193 స్థానాల్లో నిలిచారు. బ్యాలెన్స్‌ బీమ్‌ విభాగంలో ప్రణతి దాస్‌ 138వ, అరుణ 164వ, ప్రణతి నాయక్‌ 174వ స్థానాలు సాధించారు. ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ క్వాలిఫికేషన్స్‌లోనూ విఫల ప్రదర్శన చేస్తూ ప్రణతి దాస్‌, ప్రణతి నాయక్‌ 151వ, 179వ స్థానాలతో ముగించారు. ఇక, ఈ విభాగంలో అరుణారెడ్డి తన ఈవెంట్‌ను పూర్తిగా ఫినిష్‌ కూడా చేయలేకపోయింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD