భారత టూర్‌ను బహిష్కరిస్తాం

Prajasakti

Prajasakti

Author 2019-10-22 04:38:20

img

* బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు ఆటగాళ్ల హెచ్చరిక
ఢాకా: తమ డిమాండ్లను నెరవేర్చకుంటే భారత్‌ టూర్‌ను బహిష్కరిస్తామని బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ఆ దేశ క్రికెట్‌ బోర్డుకు హెచ్చరించారు. షకీబ్‌-అల్‌-హసన్‌, మహ్మదుల్లా, తమీమ్‌ ఇక్బాల్‌తో పాటు 50మంది ఆటగాళ్లు సోమవారంనుంచి ప్రారంభమైన శిక్షణా శిబిరాన్ని బహిష్కరించారు. భారత్‌ పర్యటనకు బయల్దేరాలంటే క్రికెట్‌బోర్డు స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ... లేకుంటే జాతీయస్థాయి క్రికెట్‌తోపాటు, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌, భారత పర్యటననూ బహిష్కరిస్తామని వీరు తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం బంగ్లాదేశ్‌లో జరిగే ప్రిమియర్‌లీగ్‌(బిపిఎల్‌)లో ఆటగాళ్ల బేస్‌డ్‌ ధరను స్థిరీకరించడమేనని తెలిసింది. ఆ నిబంధనను సవరించాలని, దీంతో పాటు 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను ఆ దేశ క్రికెట్‌ బోర్డుకు ఇప్పటికే ఆటగాళ్లు సమర్పించారు. అయినా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఆటగాళ్లకు స్పష్టమైనహామీ ఇవ్వలేదని తెలిసింది. దీంతో నవంబర్‌ 3 నుంచి భారత్‌ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు ఆటగాళ్లు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు భారత్‌తో తలపడాల్సి ఉంది. ఈ విషయమై బిసిసిఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ అది బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అంతర్గత వ్యవహారం. వారినుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం రానంత వరకూ మేమెలాంటి వ్యాఖ్యలు చేయబోమని తెలిపారు. బంగ్లా బోర్డు సిఇవో నిజాముద్దీన్‌ చౌదరి మాట్లాడుతూ ఆటగాళ్లు తమకు అధికారికంగా వారి డిమాండ్లు తీసుకువచ్చిన వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల డిమాండ్లు...
ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఫీజు రూ.35 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచాలి. ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్ల జీతాలను 50%తోపాటు మైదానం, సహాయ సిబ్బంది వేతనాలు పెంచాలి. ప్రయాణ ఖర్చులు, బంగ్లాదేశ్‌ ప్రిమియర్‌లీగ్‌ను తిరిగి ఫ్రాంచేజీ విధానంలోకి మార్చడం. ఢాకా ప్రిమియర్‌ లీగ్‌(ఫస్ట్‌క్లాస్‌) మార్పులు, సెంట్రల్‌ కాంట్రాక్టు వేతనాలు పెంచడం, ఆటగాళ్ల సంఘాలకు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు లేకుండా డిమాండ్లను పరిష్కరించాలి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD