భారత పర్యటనకు బంగ్లా జట్టు ఇదే

Newwaves

Newwaves

Author 2019-10-18 06:32:00

img

ఢాకా: భారతదేశంలో జరిగే టీ20 సీరీస్‌లో పాల్గొనే 15 మందితో కూడిన జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నవంబర్‌లో ఈ సీరీస్ జరుగుతుంది. బంగ్లాదేశ్ తరఫున భారత్‌తో ఆడే జట్టుకు షకిబ్ అల్ హసన్ నాయకత్వం వహిస్తాడు. సుమారు మూడేళ్ళ తర్వాత బంగ్లా స్పిన్నర్ అరాఫత్ సన్నీ, పేసర్ అల్ అమీన్ హుస్సేన్ లకు సెలెక్టర్ల నుంచి పిలుపు రావడం విశేషం. వీరిద్దరూ చివరిగా 2016 టీ20 ప్రపంచ కప్ లో పాల్గొన్నారు.

ఇండియా వేదికగా జరిగిన ఈ టీ20లో సన్నీ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదు వచ్చింది. దాంతో పాటుగా తన ప్రియురాలి వ్యక్తిగత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఆరోపణలు ఎదుర్కొన్న సన్నీ 2017లో అరెస్టయ్యాడు కూడా. మూడు టీ20ల సీరీస్లో భాగంగా నవంబర్ 2న భారతదేశ రాజధాని ఢిల్లీ వేదికగా తొలి మ్యాచ్ టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య జరుగుతుంది.

బంగ్లా టీమ్: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, నయీమ్ షేక్, ముష్ఫికర్ రహిమ్ (కీపర్), మహ్మదుల్లా రియాద్, అఫిఫ్ హుస్సేన్, మొసద్దెక్ హుస్సేన్, అమీనుల్ ఇస్లామ్ బిప్లాబ్, అరాఫత్ సన్నీ, మహమ్మద్ సైఫుద్దీన్, అల్ అమిన్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షఫీయుల్ ఇస్లామ్.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN