భారత లెజెండ్స్‌ సారథి సచిన్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-18 06:05:05

  • ‘రోడ్‌ సేఫ్టీ’టోర్నీలో

న్యూఢిల్లీ: ‘రోడ్‌ సేఫ్టీ’ వరల్డ్‌ టీ20 టోర్నీలో ఆడడానికి మొత్తం 110 మంది మాజీ క్రికెటర్లు సంసిద్ధత వ్యక్తం చేశారు. రహదారుల భద్రతపై అవగాహన కోసం నిర్వహించే ఈ టోర్నీలో దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ లారా సహా బ్రెట్‌లీ, దిల్షాన్‌, జహీర్‌ ఖాన్‌ తదితరులు మళ్లీ బరిలోకి దిగనున్నారు. భారత లెజెండ్స్‌, ఆస్ట్రేలియా లెజెండ్స్‌, సౌతాఫ్రికా లెజెండ్స్‌, శ్రీలంక లెజెండ్స్‌, వెస్టిండీస్‌ లెజెండ్స్‌, ఇలా మొత్తం 5 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 2-16 వరకు ముంబై, పుణెలో నిర్వహించనున్నారు. ఇండియా లెజెండ్స్‌కు సచిన్‌ సారథ్యం వహించనున్నాడు. ‘దిగ్గజాలు పాల్గొంటున్న ఈ టోర్నీ.. రహదారుల భద్రతపై మంచి సందేశాన్ని ఇస్తుంద’ని లీగ్‌ కమిషనర్‌ సునీల్‌ గవాస్కర్‌ అన్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN