భారీ స్కోర్‌ దిశగా టీమిండియా….

Amaravatinews

Amaravatinews

Author 2019-10-11 14:21:39

img

Share this on WhatsApp

పూణె : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (101; 173 బంతుల్లో 16×4) టెస్టుల్లో 26వ శతకం బాదాడు. అతడికన్నా ముందు వైస్‌కెప్టెన్‌ అజింక్యా రహానె(50; 145 బంతుల్లో 8×4) అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో 109 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్‌ 345/3తో పటిష్ఠ స్థితిలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఓవర్‌నైట్‌ స్కోర్‌ 273/3తో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ బాధ్యతాయుతంగా ఆడుతూ దక్షిణాఫ్రికా బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటున్నారు. వీరిద్దరూ ఇప్పటివరకు 290 బంతుల్లో 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బ్యాట్స్‌మెన్‌ ఇలాగే కొనసాగితే టీమిండియా భారీ స్కోర్‌ సాధించే అవకాశం ఉంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN