భార్యలను అలా చూడొద్దు

Nava Telangana

Nava Telangana

Author 2019-10-04 02:46:32

- క్రికెట్‌ బోర్డులకు సానియా చురక
న్యూఢిల్లీ : స్వదేశీ, విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల సతీమణులను తోడుగా తీసుకెళ్లేందుకు క్రికెట్‌ బోర్డులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా విమర్శలు గుప్పించారు. ఐక్య రాజ్య సమితి మహిళా సహృద్బావ రాయబారిగా ఉన్న సానియా మీర్జా ఈ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'చాలా సందర్బాల్లో, భారత క్రికెట్‌ జట్టుతో సహా చాలా జట్లు తోడుగా భార్యలను, ప్రియురాళ్లను అనుమతించటం లేదు. ఆటగాళ్లు పరధ్యానంలో పడతారనే కారణం చెబుతున్నారు. ఇలా చెబితే, దాని అర్థం ఏమిటీ? పని నుంచి మగాళ్ల దృష్టిని మహిళలు మరల్చుతున్నారా?. ఈ ధోరణి మహిళలు పరధ్యాయానికి ఆకర్షణగా పని చేస్తారు, ఎప్పటికి బలం కాలేరనే అర్థాని ఇస్తుంది. ఇది మరింత పెద్ద సమస్య' అని సానియా మీర్జా తెలిపింది. 2019 ప్రపంచకప్‌ సమయంలో భారత్‌తో మ్యాచ్‌కు ముందు భర్త షోయబ్‌ మాలిక్‌తో కలిసి డిన్నర్‌కు రెస్టారెంట్‌కు వెళ్లిన ఫోటోలు అప్పట్లో సోషల్‌ మీడియాలో దుమారం రేపిన సంగతి తెలిసిందే.a

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD