మంచు ప్రభావమే కీలకం

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-01 06:32:45

  • డే/నైట్‌ టెస్టుపై సచిన్‌

న్యూఢిల్లీ: ఈడెన్‌లో మంచు ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంపైనే తొలి డే/నైట్‌ టెస్టు సక్సెస్‌ ఆధారపడి ఉందని బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. లేకపోతే తడిసిన బంతితో పేసర్లు, స్పిన్నర్లు ఇబ్బంది ఎదుర్కొంటారన్నాడు. అయితే భారత జట్టు డే/నైట్‌ మ్యాచ్‌ ఆడబోతుండడం మంచి పరిణామమని చెప్పాడు. ‘మంచు ప్రభావం చూపనంత వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ పరిస్థితి అలా లేకపోతే మాత్రం బౌలర్లకు కఠిన పరీక్ష ఎదురవుతుంది. అయితే ఈడెన్‌లో రాత్రి వేళ మంచు సమస్య సహజమే. ప్రేక్షకుల కోణంలో చూస్తే డే/నైట్‌ నిర్వహణ మంచి ఆలోచన. సాయంత్రం వేళ మ్యాచ్‌లు చూసేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఆటగాళ్ల కోణంలో చూస్తే గులాబీ బంతితో ఆడ డం చెడ్డ విషయమేమీ కాదు. ఎరుపు బంతికి విభిన్నంగా గులాబీ బంతి ఎలా స్పందిస్తుందో తెలుసుకోవచ్చు. ఇక నెట్స్‌లో ఆటగాళ్లు కొత్త, పాత బంతుల కలయికతో ప్రాక్టీస్‌ చేస్తే మ్యాచ్‌పై అవగాహన పెరుగుతుంది’ అని సచిన్‌ సూచించాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN