మనసు మార్చుకున్న గంగూలీ.. రాంచీ టెస్టుకు దూరం!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-18 00:15:37

img

రాంచీ: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ నెల 19న మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టును కలిసి వారిలో జోష్ నింపాలని బీసీసీఐ కాబోయే చీఫ్ సౌరవ్ గంగూలీ భావించాడు. అయితే, ఇప్పుడా నిర్ణయాన్ని గంగూలీ వెనక్కి తీసుకున్నాడు. ఈ నెల 20న కేరళలోని కొచ్చిలో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సి ఉండడంతో గూంగూలీ తన మనసు మార్చుకున్నాడు.

‘‘రాంచీ వెళ్లాలనే అనుకున్నా. అయితే ఇండియన్ సూపర్ లీగ్‌ను ప్రారంభించాల్సి ఉండడంతో రాంచీ వెళ్లేందుకు సమయం సరిపోవడం లేదు. ఐఎస్ఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లాలనే నిర్ణయించుకున్నా’’ అని గంగూలీ తెలిపాడు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ నెల 19 నుంచి 23 వరకు చివరి టెస్టు జరగనుంది. అయితే, కొచ్చిలో ఐఎస్‌ఎల్ ప్రారంభోత్సవం అనంతరం గంగూలీ నేరుగా ముంబైలోని బీసీసీఐ ముఖ్య కార్యాలయానికి చేరుకోనున్నాడు. 23న బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపడతాడు.

ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు మెంటార్‌గా ఉన్న గంగూలీ ఆ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ.. బెంగాలీ టీవీ రియాలిటీ షో ‘దాదాగిరి’ నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. అలాగే ఎండార్స్‌మెంట్స్ కూడా చేసుకోవచ్చు. తాను దాదాగిరి రియాలిటీ షోతోపాటు ఎండార్స్‌మెంట్స్ చేసుకుంటానని, మిగతావన్నీవదిలిపెట్టేస్తానని గంగూలీ తెలిపాడు. కామెంటరీ, పత్రికలకు వ్యాసాలు, ఐపీఎల్ తదితర అన్నింటికీ ఇప్పటి నుంచే ఫుల్‌స్టాప్పెడుతున్నట్టు వివరించాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN