మరోసారి విండీస్ కోచ్‌గా సిమన్స్

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-16 03:03:00

img
సెయింట్ జాన్స్ : వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు హెడ్‌కోచ్‌గా ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ ఫిల్ సిమన్స్ మరోసారి నియమితుడయ్యాడు. 2016 టీ20ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించి, ఆ తర్వాత బోర్డుతో విభేదాల కారణంగా సిమన్స్ పదవిని కోల్పోయాడు. అయితే అతడిని నాలుగేండ్ల కాలానికి మరోసారి హెడ్‌కోచ్‌గా నియమిస్తున్నట్టు క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) మంగళవారం ప్రకటించింది. సరైన సమయంలో, సరైన వ్యక్తిని కోచ్ పదవికి ఎంపిక చేశామని తెలిపింది. మార్చి 2015 నుంచి దాదాపు 18 నెలల పాటు ఫిల్ కోచ్‌గా ఉండగా.. టీ20ల్లో రాణించిన విండీస్ జట్టు.. 14 టెస్టుల్లో ఒక్కటి మాత్రమే గెలిచి ఘోర ప్రదర్శన చేసింది. బోర్డు సంప్రదాయాలు, వ్యూహాల అమలు పట్ల సీడబ్ల్యూఐ - సిమన్స్‌కు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో తరచూ జోక్యం చేసుకుంటున్నాడన్న కారణంతో 2016 సెప్టెంబర్‌లో సిమన్స్‌ను కోచ్ పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించిన ఫిల్, ఈ ఏడాది ప్రపంచకప్ తర్వాత తప్పుకున్నాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD