మరో ప్రపంచకప్ ఆడేవాడిని..

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-28 04:47:00

img
న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ తనకు మద్దతుగా నిలిచి ఉంటే ఇంకో ప్రపంచకప్ టోర్నీ ఆడేవాడినని మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. 2011లో భారత్ వన్డే వరల్డ్‌కప్ గెలువడంలో కీలకపాత్ర పోషించిన యువీ.. అటు బంతితో ఇటు బ్యాటుతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన విషయం తెలిసిందే. 2017 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తనను జట్టు నుంచి తప్పిస్తారని అసలు ఊహించలేకపోయానని యువీ చెప్పాడు. 36ఏండ్ల వయసులో యోయో టెస్టు పాసైనా జట్టుకు ఎంపిక చేయలేదని, యువకులకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తే తనతో చర్చించి ఉండాల్సిందని, అయితే, రిటైరవడం పట్ల తాను చింతించడం లేదని యువీ స్పష్టం చేశాడు.

టీ20 కెప్టెన్సీ రోహిత్‌కు ఇవ్వొచ్చు

పొట్టి ఫార్మాట్లో టీమ్‌ఇండియాకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించాలన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో.. యువరాజ్ కూడా అలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు. మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ చేయడం విరాట్ కోహ్లీ పనిభారంగా ఫీలైతే.. టీ20లకు రోహిత్‌ను సారథిగా పరిగణించాలని సూచించాడు.
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN