మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్ భారత్ కైవసం

Nava Telangana

Nava Telangana

Author 2019-10-02 02:11:00

సూరత్: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళా జట్టు.. దక్షిణాఫ్రికాపై 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకుంది. సూరత్‌ వేదికగా మంగళవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో కూడా వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. దీంతో మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌ (13/3), రాధా యాదవ్‌ (16/2) అద్భుత బౌలింగ్‌ చేశారు. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా రెండు, మూడు మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి. సూరత్‌ వేదికగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆఖరి టీ20 ఆడనుంది.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN