మరో రికార్డు చేరువలో .. రోహిత్ శర్మ.. కోహ్లీని దాటేస్తాడు..

Navyamedia

Navyamedia

Author 2019-11-03 01:22:21

img

భారతజట్టు సారధి విరాట్‌ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టే పనిలో రోహిత్ శర్మపడ్డాడు. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల వీరుడి స్థానం కోసం వీరిద్దరూ పరస్పరం పోటీపడుతున్నారు. 72 మ్యాచుల్లో 50 సగటుతో 2,450 పరుగులతో విరాట్‌ రారాజుగా ఉన్నాడు. అతడి స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు హిట్‌మ్యాన్‌ సిద్ధమైపోయాడు. బంగ్లాదేశ్‌తో తొలి పోరులో 8 పరుగులు చేస్తే చాలు. అతడు నంబర్‌వన్‌ స్థానాన్ని ఆక్రమిస్తాడు. ప్రస్తుతం రోహిత్‌ 98 మ్యాచుల్లో 32.14 సగటుతో 2,443 పరుగులతో ఉన్నాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా వరుస శతకాలతో విజృంభించిన రోహిత్‌ మరో రికార్డు సాదించినట్టే.

కోహ్లీ చాలా రోజులుగా ఎడతెరపి లేకుండా క్రికెట్‌ ఆడుతున్నాడు. అతడి పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొన్న సెలక్టర్లు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు విశ్రాంతి కల్పించారు. నాయకత్వ బాధ్యతలను రోహిత్‌కు అప్పగించారు. పొట్టి క్రికెట్లో హిట్‌మ్యాన్‌కు మంచి పట్టుంది. సారథిగా అతడు ముంబయి ఇండియన్స్‌ను నాలుగుసార్లు విజేతగా నిలిపాడు. బౌలర్లను ఉపయోగించుకోవడంలో మంచి నేర్పరి. పైగా గతేడాది దిల్లీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో అతడు 80 పరుగులు చేశాడు. విరాట్‌ తిరిగి టెస్టు సిరీస్‌కు జట్టుతో కలుస్తాడు. దిల్లీలో కాలుష్యంతో మ్యాచ్‌పై ఆందోళన నెలకొంది.READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN