మర్రిని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన వంటేరు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-11-06 04:06:08

మేడ్చల్, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్‌గా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి మంగళవారం మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వంగా కలిశారు. నేడు తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా మర్రి రాజశేఖర్ రెడ్డిని ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేత జగన్‌రెడ్డి పాల్గొన్నారు.
వైద్యసేవలపై నిర్లక్ష్యం సహించం
రాజేంద్రనగర్, నవంబర్ 5: రోగులకు మెరుగైన వైద్యం అందించకుంటే సహించేది లేదని జిల్లా టీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు ఎన్ను చైతన్యరెడ్డి అన్నారు. మంగళవారం కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఈఎస్‌ఐ ఆసుపత్రి రాకపోవడం సరైన మందులు లేక అవస్థలు పడుతున్నామని కార్మికులు దృష్టికి తీసుకువచ్చారు. వార్డు సభ్యులు మైసయ్యతో కలిసి ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు ఉన్నప్పటికీ సకాలంలో ఆసుపత్రికి రావడం లేదని మండిపడ్డారు. ప్రజలు, డాక్టర్లు ఎప్పుడు వస్తారని అడిగితే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆరోపించారు. ఈఎస్‌ఐ ఆసుపత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉందని మందుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని తెలిపారు. కార్మికులు పడుతున్న కష్టాలను ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని రోగులకు భరోసా కల్పించారు.
రేణుక ఎల్లమ్మ ఆలయంలో కార్తీక పూజ
మహేశ్వరం, నవంబర్ 5: కార్తీకమాసం మంగళవారం సందర్భంగా మండలంలోని సర్ధార్‌నగర్, రావిరాల గ్రామాల మధ్య నెలకొన్న శ్రీ సూర్యగిరిరేణుక ఎల్లమ్మ ఆలయం, మహేశ్వరంలోని శ్రీ శివగంగ రాజేశ్వర స్వామి. ఘట్టుపల్లి వీరాంజనేయ స్వామి, శ్రీనగర్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయల్లో భక్తుల రద్దీ నెలకొంది. మహిళలు ఆలయాల్లో పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ ఆలయంలో భక్తులు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తల్తెత్తకుండా కమిటీ చైర్మన్ రత్నం ప్రత్యేక ఏర్పాటు చేశారు.
స్వరూపానందస్వామి దర్శించుకున్న నవతా రెడ్డి
శేరిలింగంపల్లి, నవంబర్ 5: విశాఖ శ్రీ శారదా పీఠాన్ని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి సంద్శంచారు. మంగళవారం శ్రీ శారదా పీఠంలోని ఆశ్రమంలో శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీని తల్లిదండ్రులతో కలిసి ఫలాలు సమర్పించిన కార్పొరేటర్ నవత రెడ్డి స్వామివారి ఆశీర్వచనం తీసుకున్నారు.
పరిశుభ్రతలో భాగస్వాములు కావాలి
ఉప్పల్, నవంబర్ 5: బోడుప్పల్ పట్టణ పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలని టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పులకండ్ల జంగా రెడ్డి పిలుపునిచ్చారు. నగర శుద్ధీకరణలో భాగంగా మంగళవారం ఉదయన్‌నగర్, బృందావన్ కాలనీలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో నేతలు నత్తి మైసయ్య, నగేష్ గౌడ్, నరేందర్, మనోజ్, కాలనీ ప్రజలు నగేష్, స్వామి, హుధుర్, శ్రీనివాస్, శ్రీ్ధర్, జయ తులసీ, శ్రీ్ధర్ శర్మ, గోపాల్ శ్రమదానం ద్వారా కాలనీలను శుభ్రం చేశారు.బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని చెంగిచర్లలో మంత్రి మల్లారెడ్డి పిలుపు మేరకు టీఆర్‌ఎస్ నాయకుడు బింగి జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో కాలనీలలో పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD