మళ్లీ వర్షం దెబ్బ

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-30 05:35:00

img

-భారత్‌, దక్షిణాఫ్రికా మహిళల మూడో టీ20 రద్దు
సూరత్‌: భారత్‌, దక్షిణాఫ్రికా మహిళల టీ20 సిరీస్‌ను వరుణుడు నీడలా వెంటాడుతున్నాడు. ఇప్పటికే రెండో టీ20 వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోగా.. తాజాగా మూడో మ్యాచ్‌ను కూడా వరుణుడు అడ్డుకున్నాడు. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ జరగాల్సిన మూడో టీ20 ఒక్క బంతి పడకుండానే రైద్దెంది. ఉదయం భారీ వర్షం కురవడంతో మైదానంగా చిత్తడిగా మారింది. దీంతో గ్రౌండ్‌ను కవర్స్‌తో కప్పి ఉంచారు. మ్యాచ్‌ సమయానికి ముందు మరోసారి చినుకులు పడటంతో నిర్ణీత సమయానికి మైదానం ఆటకు సిద్ధంగా లేకుండా పోయింది. అరగంట ఆగాక మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఆట సాగే పరిస్థితి లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సిరీస్‌లో ప్రస్తుతం భారత్‌ 1-0తో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య నాలుగో మ్యాచ్‌ మంగళవారం ఇక్కడే జరుగనుంది.
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD