మళ్లీ విండీస్‌ కోచ్‌గా సిమ్మన్స్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-16 07:47:15

ఆంటిగ్వా: మూడేళ్ల క్రితం వద్దనుకుంటూ వేటు వేసిన ఫిల్‌ సిమ్మన్స్‌ను తిరిగి క్రికెట్‌ వెస్టిండీస్‌ (సీడబ్ల్యుఐ) తమ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. ఈసారి అతడి పదవీకాలం నాలుగేళ్లు ఉండబోతోంది. డెస్మండ్‌ హేన్స్‌, ఫ్లాయిడ్‌ రీఫెర్‌ కూడా కోచ్‌ కోసం పోటీపడ్డారు. 2016లో సిమ్మన్స్‌ పర్యవేక్షణలోనే విండీస్‌ టీ20 ప్రపంచకప్‌ గెలిచింది. అయితే ఆ తర్వాత ఐదు నెలలకే ఆ పదవి నుంచి ఉద్వాసన పలికారు. క్రికెటర్ల జీతభత్యాల విషయంలో బోర్డుతో సిమ్మన్స్‌కు విభేదాలు ఏర్పడ్డాయి. మరోవైపు విండీస్‌ క్రికెట్‌ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా మాజీ ఆటగాడు రోజర్‌ హార్పర్‌ను నియమించారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN