మళ్లీ ‘టాప్‌’లో కోల్‌కతా

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-10 03:26:52

కోల్‌కతా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో శని వారం జరిగిన మ్యాచ్‌లో రాయ్‌కృష్ణ సూపర్‌ షోతో అథ్లెటికో డి కోల్‌కతా 3-1తో జంషెడ్‌పూర్‌పై నెగ్గింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా మళ్లీ టాప్‌లోకి చేరింది. సెకం డాఫ్‌లో యువ స్ట్రయికర్‌ రాయ్‌కృష్ణ (57వ, 71వ) రెండు గోల్స్‌ చేసి కోల్‌కతాను ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత సెర్గో కాస్టెల్‌ (85వ) జంషెడ్‌పూర్‌ తరఫున తొలి గోల్‌ చేశాడు. 91వ నిమిషంలో కోల్‌కతా మిడ్‌ ఫీల్డర్‌ గార్సియా మెరుపు గోల్‌ చేసి 3-1తో తన జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN