మహిళల రెండో టి20 వ్యాచ్ వర్షార్పణం

Nava Telangana

Nava Telangana

Author 2019-09-27 13:30:00

హైదరాబాద్‌: భారత్‌, దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్‌ జట్లను వరుణుడు వెంటాడుతున్నాడు. గురువారం జరగాల్సిన రెండో టి20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. తొలి మ్యాచ్‌లో భారత్‌ 11 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక సిరీస్‌లో చివరి, మూడో టి20 ఆదివారం జరుగుతుంది. పిచ్‌ తడవకుండా కవర్లు కప్పివుంచినా అవుట్‌ఫీల్డ్‌ మ్యాచ్‌ నిర్వహణకు అనుకూలంగా లేకపోయింది. ముందురోజునుంచి కురుస్తున్న వర్షాలతో అవుట్‌ఫీల్డ్‌ అంతా చిత్తడిగా మారడంతో అంపైర్లు పలుమార్లు గ్రౌండ్‌ను పరిశీలించి మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం లేకపోవడంతో చివరకు రాత్రి 8 గంటలకు రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. ఆరు గంటల తరువాత వర్షం తగ్గినప్పటికీ అవుట్‌ఫీల్డ్‌ ఏమాత్రం తడారకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. మ్యాచ్‌ నిర్వహణకోసం స్టేడియం సిబ్బంది చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. స్టేడియం డ్రైనేజి సిస్టమ్‌ సరిగా లేకపోవడమే మ్యాచ్‌ రద్దుకు కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD