మహిళా అంపైర్‌కు అరుదైన గౌరవం

Mana Telangana

Mana Telangana

Author 2019-10-25 10:55:24

img

కేప్‌టౌన్: అంపైర్‌గా రెండో ఇన్నింగ్స్ చేపట్టిన సౌతాఫ్రికా మాజీ మహిళా క్రికెటర్ లారెన్ ఏజెన్‌బాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. దక్షిణాఫ్రికా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కు లారెన్‌ను అంపైర్‌గా ఎంపిక చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి అనూహ్య నిర్ణయం తీసుకుది. ఇటీవల ముగిసిన మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ ఫైనల్‌కు లారెన్ అంపైర్‌గా వ్యవహరించింది. ఆమె ప్రతిభను దృష్టిలో పెట్టుకుని సౌతాఫ్రికా పురుషుల ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా లారెన్‌ను అంపైర్‌గా నియమించాలని ఐసిసి నిర్ణయించింది.

కాగా, పురుషుల క్రికెట్‌కు ఓ మహిళాను ఎంపిక చేయడం ఇదే తొలిసారి. ఫస్ట్ క్లాస్ పోటీల్లో అంపైర్‌గా వ్యవహరించే అవకాశాన్ని లారెన్ దక్కించుకుంది. ఇప్పటి వరకు ఏ మహిళా అంపైర్ కూడా పురుషుల ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ బాధ్యతలు నిర్వర్తించలేదు. కానీ, లారెన్‌కు ఈ అరుదైన అవకాశం లభించింది. క్రికెట్‌లో మహిళలకు సమాన అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసిసి ఒక ప్రకటనలో వెల్లడించింది.

Lauren Agenbag is a South African cricket umpire

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD