మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం

Mana Telangana

Mana Telangana

Author 2019-11-01 02:55:56

img

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లేన్ మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి కొంత కాలం విశ్రాంతి తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడు టి20కి ముందు మాక్స్‌వెల్ అనూహ్య నిర్ణయంతో అందరికి షాక్ ఇచ్చాడు. మానసిక సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, దీని కోసం కొంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు చెప్పాడు. లంకతో జరిగిన తొలి టి20లో మాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.

కాగా, వ్యక్తిగత కారణాల వల్లే కొంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపాడు. కొన్ని రోజుల విరామం తర్వాత మళ్లీ క్రికెట్ ఆడడం ప్రారంభిస్తానని చెప్పాడు. ఇక, ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన మాత్రం లేదన్నాడు. మరి కొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడతానని మాక్స్‌వెల్ స్పష్టం చేశాడు. కాగా, మాక్స్‌వెల్ నిర్ణయానికి క్రికెట్ ఆస్ట్రేలియా మద్దతు ప్రకటించింది. అతని అభ్యర్థనను అంగీకరించింది. మాక్స్‌వెల్ వంటి క్రికెటర్ దొరకడం తమ అదృష్టమని క్రికెట్ బోర్డు పేర్కొంది. మరోవైపు మాక్స్‌వెల్ స్థానంలో డి ఆర్సీ షార్ట్‌ను జట్టులోకి తీసుకుంది.

Maxwell takes indefinite break from cricket

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD