మాజీ క్రికెటర్ ఆప్టే మృతి

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-24 03:49:00

img
ముంబై : టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ మాధవ్ ఆప్టే(86) గుండెపోటుతో సోమవారం ఉదయం మృతి చెందారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ద వాఖానాలో చికిత్స పొందు తూ ఆయన తుదిశ్వాస విడిచారు. భారత్ తరఫున మాధవ్ ఆప్టే ఏడు టెస్టులు ఆడి ఓ శతకం సహా 542 పరుగులు చేశారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 67 మ్యాచ్‌ల్లో 3,336 పరుగులతో రాణించారు. 1952లో పాకిస్థాన్‌తో ముంబైలో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఆయన 1953 ఏప్రిల్‌లో వెస్టిండీస్‌తో చివరి మ్యాచ్ ఆడారు. ఓ టెస్టు సిరీస్‌లో 400 పరుగులు చేసిన తొలి ఓపెనర్‌గా అప్పట్లో ఆప్టే రికార్డు నెలకొల్పారు. వినూ మన్కడ్, పాలీ ఉమ్రిగర్, విజయ్ హజారే, రుసి మోదీ లాంటి దిగ్గజాలతో కలిసి మాధవ్ ఆప్టే ఆడారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కి 1989లో అధ్యక్షుడిగానూ పనిచేశారు. శివాజీ పార్క్‌లో జరిగిన ఆప్టే అంత్యక్రియలకు మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, మిలింద్ తదితరులు హాజరై నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు పలువురు మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు సంతాపం వ్యక్తం చేశారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN