మార్‌క్రమ్‌ సెల్ఫ్‌ పంచ్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-18 06:02:01

  • చివరి టెస్టుకు దూరం

రాంచీ: భారత్‌తో చివరిదైన మూడో టెస్టు ఆరంభానికి ముందే దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ మార్‌క్రమ్‌ మణికట్టు గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అయితే ఈ గాయం అతడి స్వయంకృతం కావడం గమనార్హం. పుణెలో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన మార్‌క్రమ్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సున్నా పరుగుల వద్దే ఎల్బీ అయ్యాడు. డీఆర్‌ఎస్‌ కోసం తన సహచర ఓపెనర్‌ ఎల్గర్‌తో చర్చించి రివ్యూ కోరకుండానే పెవిలియన్‌కు వెనుదిరిగాడు. అయితే రీప్లేలో బంతి లెగ్‌ స్టంప్‌నకు మిస్‌ అవుతున్నట్టు కనిపించింది. అంటే రివ్యూ కోరివుంటే నాటౌట్‌ అన్నమాట. దీంతో తీవ్ర అసహనంతో అతడు ఓ గట్టి వస్తువుకు బలంగా పంచ్‌ ఇవ్వడంతో సీటీ స్కాన్‌లో అతడి కుడిచేతి మణికట్టుకు ఫ్రాక్చర్‌ అయినట్టు క్రికెట్‌ దక్షిణాఫ్రికా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే తాను చేసిన తప్పునకు చింతిస్తున్నానని, ఇలాంటి పరిస్థితిలో స్వదేశానికి వెళ్లనుండడం నిరాశపరుస్తోందని మార్‌క్రమ్‌ చెప్పాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN