ముగిసిన సమ్మె.. బ్యాట్ పట్టిన క్రికెటర్లు..!

Ntvtelugu

Ntvtelugu

Author 2019-10-25 13:18:38

img

బంగ్లాదేశ్‌ క్రికెటర్లు ఎట్టకేలకు సమ్మె విరమించారు. మైదానంలోకి దిగి బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యారు.. దీంతో భారత్‌లో వచ్చే నెలలో జరగాల్సిన బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు పర్యటనపై ఉన్న సందేహాలు తొలిగిపోయాయి. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు పెద్దలతో చర్చలు సఫలమయ్యాయని బంగ్లా టీ20 కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ తెలిపాడు. క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు, డైరెక్టర్లతో సమావేశమయ్యామని, తమ డిమాండ్ల గురించి వారికి వివరించామని చెప్పారు. వారు సానుకూలంగా స్పందించారని, వీలైనంత తొందరగా తమ డిమాండ్లను తీరుస్తామని హామీ ఇచ్చారని వివరించారు షకిబ్‌ అల్‌ హసన్‌. కాగా, 11 డిమాండ్లతో సమ్మెలోకి వెళ్లారు క్రికెటర్లు.. సమ్మె విరమణతో నేటి నుంచి నేషనల్ క్రికెట్ లీగ్‌లో తిరిగి ఆడనున్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD