మూడు సెకన్లలో కోహ్లీని ఒప్పించా..

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-03 06:35:04

img

కోల్‌కతా: ‘కేవలం మూడు సెకన్లు’.. ఇది డే/నైట్‌ టెస్టు కోసం భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఒప్పించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తీసుకున్న సమయమట. శనివారం ఈ విషయాన్ని దాదానే స్వయంగా తెలిపాడు. కొన్నేళ్లుగా గులాబీ టెస్టు విషయంలో వెనుకంజ వేస్తున్న భారత జట్టును.. బోర్డు కొత్త బాస్‌గా వచ్చిన వారం రోజుల్లోనే గంగూలీ ఆడించేలా చేశాడు. ఈనెల 22 నుంచి ఈడెన్‌లో రెండో టెస్టును ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహించనున్నారు. ‘గతంలో ఏం జరిగిందో, ఇప్పటిదాకా భారత్‌ ఈ తరహా మ్యాచ్‌లు ఎందుకు ఆడలేదో నిజంగా నాకు తెలీదు. అలాగే అడిలైడ్‌లో కూడా ఎందుకు అంగీకరించలేదో నాకైతే అవగాహన లేదు. కోహ్లీతో గంట పాటు సమావేశమయ్యా. తొలి ప్రశ్నగా డే/నైట్‌ గురించే అడిగాను. కేవలం మూడు సెకన్లలోనే సమాధానమిస్తూ ముందుకెళదాం అన్నాడు. ఎందుకంటే ఖాళీ స్టాండ్స్‌ మధ్య టెస్టులు ఆడిస్తే లాభం లేదనే విషయాన్ని అతడు కూడా గ్రహించాడు. ఇప్పుడు ప్రజలు ఆఫీ్‌సలను వదిలి మ్యాచ్‌లకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే వారికి అనుకూలంగా మనం మారితే మంచి ఫలితాలు వస్తాయి’ అని దాదా తెలిపాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN