మూడో టీ20 రద్దు

Prajasakti

Prajasakti

Author 2019-09-29 06:09:21

img

భారత్‌ × దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్‌
సూరత్‌ : ఇక్కడ నిరంతరాయంగా వర్షం కురుస్తుండ డంతో భారత్‌-దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరగాల్సిన మూడో టీ20 రద్దు అయ్యింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత అమ్మాయిలు 11 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యతలో నిలిచారు. గురువారం జరగాల్సిన రెండో టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. అదే క్రమంలో శనివారం ఇరుజట్ల మధ్య జరగాల్సిన మూడో టీ20 కూడా కనీసం టాస్‌ వేయకుండానే రద్దు చేశారు. మూడో రోజులుగా భారీగా వర్షం కురుస్తుండడంతో మ్యాచ్‌ ప్రారంభించడానికి ఔట్‌ ఫీల్డ్‌ ఏమాత్రం సహకరించలేదు. మైదానమంతా చిత్తడి మారడంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించి ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తునట్లు ప్రకటించారు. నాలుగు, ఐదు టీ20లు అక్టోబర్‌ 1, 4న ఇదే మైదనాంలో జరగనున్నాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD