మెక్సికో విజేత హామిల్టన్

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-29 04:15:00

img
మెక్సికో సిటీ: బ్రిటీష్ స్టార్ రేసర్ లూయిస్ హామిల్టన్ మెక్సికన్ గ్రాండ్‌ప్రిలో మరోసారి సత్తాచాటాడు. ఆదివారం ఇక్కడ జరిగిన రేస్ ఆసాంతం ఎలాంటి అవాంతరాలు లేకుండా దూసుకెళ్లి అగ్రస్థానంలో నిలిచి.. మెర్సెడెస్ జట్టుకు ఈ సీజన్‌లో పదో విజయాన్ని అందించాడు. ఫెరారీ రేసర్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానంతో రేస్‌ను ముగించగా... హామిల్టన్ జట్టుకు చెందిన వాల్తెరి బొటాస్ మూడో స్థానంలో నిలిచాడు. రేస్ మొదలైన కాసేపటికే పిట్‌స్టాప్‌కు గురైన ఫెరారీకే చెందిన మరో డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. హామిల్టన్‌కు ఇది మెక్సికోలో రెండో గెలుపు కాగా ఓవరాల్‌గా కెరీర్‌లో 83వది. వచ్చే వారం టెక్సాస్‌లో జరిగే యూఎస్ గ్రాండ్‌ప్రి ద్వారా ఆరోసారి డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను హామిల్టన్ దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెక్సికో విజయంతో తన ఖాతాలో మరో 25 పాయింట్లు వేసుకున్న లూయిస్... ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తంగా 363 పాయింట్లు సాధించి టాప్‌లో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఉన్న బొటాస్ (289) 74 పాయింట్లు వెనుకంజలో ఉన్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN