మెరిసిన అక్షర్‌, మయాంక్‌

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-11-03 03:02:00

- భారత్‌ ‘బి’పై భారత్‌ ‘సి’గెలుపు

రాంచీ: బ్యాట్‌తో అక్షర్‌ పటేల్‌ (61 బంతుల్లో 98 నాటౌట్‌; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), బంతి తో మయాంక్‌ మార్కండే (4/25) మెరువడంతో దేవ్‌ధర్‌ ట్రోఫీలో భారత్‌-బిపై భారత్‌-సి 136 పరుగుల తేడాతో గెలుపొందింది. శనివారం ఇక్కడ జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ‘సి’జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లకు 280 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ నాయకత్వంలోని ‘సి’జట్టు ఒక దశలో 126 రన్స్‌కే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించినా.. విరాట్‌ సింగ్‌ (76 నాటౌట్‌)తో కలిసి అక్షర్‌ అభేద్యమైన ఆరో వికెట్‌కు 154 పరుగులు జోడించి జట్టుకు మంచి స్కోరు అందించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో బాబా అపరాజిత్‌ (53) మినహా మిగిలిన వాళ్లు పూర్తిగా విఫలమవడంతో భారత్‌-బి 43.4 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌కు ముందే ఫైనల్‌కు అర్హత సాధించిన ఈ రెండు జట్ల మధ్య సోమవారం తుది పోరు జరుగనుంది.
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD