మెరిసిన నీషమ్‌, గప్టిల్‌.. రెండో టీ20లో కివీస్‌ గెలుపు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-04 06:35:55

వెల్లింగ్టన్‌: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ బోణీ చేసింది. జేమ్స్‌ నీషమ్‌ (42), మార్టిన్‌ గప్టిల్‌ (41) మెరవడంతో.. రెండో టీ20లో కివీస్‌ 21 పరుగులతో ఇంగ్లండ్‌పై గెలిచి 1-1తో సిరీ్‌సను సమం చేసింది. తొలుత కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు సాధించింది. నీషమ్‌, గప్టిల్‌తో పాటు గ్రాండ్‌హోమ్‌ 28, రాస్‌ టేలర్‌ 28 రన్స్‌తో రాణించారు. క్రిస్‌ జోర్డాన్‌ 3, సామ్‌ కర్రాన్‌ 2 వికెట్లు తీశారు. ఛేదనలో ఇంగ్లండ్‌ 19.5 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. డేవిడ్‌ మలాన్‌ (39), క్రిస్‌ జోర్డాన్‌ (36), కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (32) పోరాడినా పరాజయం తప్పలేదు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మిచెల్‌ శాంట్నర్‌ (3/25), టిమ్‌ సౌథీ (2/25), ఫెర్గూసన్‌ (2/34) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD