మెరిసిన ప్రియ, జెమీమా

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-10 06:39:16

img

  • 8 వికెట్లతో భారత్‌ విజయం
  • దక్షిణాఫ్రికాతో తొలి వన్డే

వడోదర: అరంగేట్ర ప్లేయర్‌ ప్రియా పూనియా (75 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతోపాటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై

ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య భారత్‌ 41.4 ఓవర్లలో

165/2తో ఛేదించింది. జెమీమా రోడ్రిగ్స్‌ (65 బంతుల్లో 7 ఫోర్లతో 55) హాఫ్‌ సెంచరీతో టీమ్‌ విజయంలో కీలకపాత్ర పోషించింది. అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా

45.1 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. మరిజన్నే కాప్‌ (54) టాప్‌ స్కోరర్‌. జులన్‌ గోస్వామి (3/33) మూడు వికెట్లు పడగొట్టగా.. శిఖా పాండే (2/38), ఏక్తా బిస్త్‌ (2/28), పూనమ్‌ యాదవ్‌ (2/33) తలో రెండు వికెట్లు కూల్చారు.

దక్షిణాఫ్రికా: 45.1 ఓవర్లలో 164 ఆలౌట్‌ (కాప్‌ 54; జులన్‌ 3/33).

భారత్‌: 41.4 ఓవర్లలో 165/2 (ప్రియా పూనియా 75 నాటౌట్‌, జెమీమా రోడ్రిగ్స్‌ 55).

మహిళా క్రికెట్‌లో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న తొలి క్రీడాకారిణిగా మిథాలీ రాజ్‌ రికార్డుల కెక్కింది. 1999, జూన్‌ 26న ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో మిథాలీ వన్డేల్లో అరంగేట్రం

చేసింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌తో 50 ఓవర్ల ఫార్మాట్‌లో 20 ఏళ్ల 105 రోజులు పూర్తి చేసుకుంది. కెరీర్‌లో ఆమె 204 వన్డేలు ఆడింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN