మెరిసిన మిథాలీ, పూనమ్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-12 06:45:48

img

  • రెండో వన్డేలో సఫారీలపై విజయం
  • 2-0తో భారత్‌దే సిరీస్‌

వడోదర: కెప్టెన్‌ మిథాలీరాజ్‌ (82 బంతుల్లో 8 ఫోర్లతో 66), పూనమ్‌ రౌత్‌ (92 బంతుల్లో 7 ఫోర్లతో 65) అర్ధ సెంచరీలతో రాణించడంతో.. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్‌ 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీ్‌సను 2-0తో భారత్‌ కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత సౌతాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 247 రన్స్‌ చేసింది. లారా వాల్వార్ట్‌ (69) హాఫ్‌ సెంచరీ సాధించింది. శిఖాపాండే, ఏక్తాబిస్త్‌, పూనమ్‌ రెండేసి వికెట్లు తీశారు. ఛేదనలో మిథాలీ, రౌత్‌ అర్ధ సెంచరీలతో విజృంభించడంతో.. టీమిండియా 48 ఓవర్లలో 5 వికెట్లకు 248 రన్స్‌ చేసి.. నెగ్గింది. ఓపెనర్లు ప్రియా పూనియా (20), జెమీమా రోడ్రిగ్స్‌ (18) నిరాశపర్చినా.. మిథాలీ-రౌత్‌ మూడో వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హర్మన్‌ప్రీత్‌ (39 నాటౌట్‌) అజేయంగా నిలిచింది. ఆఖరి వన్డే సోమవారం జరగనుంది.

సంక్షిప్త స్కోర్లు

దక్షిణాఫ్రికా: 50 ఓవర్లలో 247/6 (వాల్వార్ట్‌ 69, డూప్రీజ్‌ 44, లీజెల్‌ 40, లారా 38, త్రిషా శెట్టి 22; శిఖాపాండే 2/38, పూనమ్‌ యాదవ్‌ 2/42, ఏక్తాబిస్త్‌ 2/45);

భారత్‌: 48 ఓవర్లలో 248/5 (మిథాలీ రాజ్‌ 66, పూనమ్‌ రౌత్‌ 65, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 39 నాటౌట్‌, ప్రియా పూనియా 20, జెమీమా రోడ్రిగ్స్‌ 18; అయబోంగా 3/69, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ 1/41, మారిజనె కాప్‌ 1/29).

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN