మేరీకోమ్‌కు అరుదైన గౌరవం

Nava Telangana

Nava Telangana

Author 2019-11-01 04:11:57

టోక్యో: మణిపూర్‌కు చెందిన భారత మహిళా బాక్సర్‌, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీకోమ్‌కు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మేరీకోమ్‌ను నియమిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ(ఐఒసి) గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి 10 మంది అంబాసిడర్లలో మహిళల అథ్లెట్ల విభాగంలో ఆసియా నుంచి మేరీకోమ్‌ ఒక్కరే కావడం గమనార్హం. ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెల్చుకొని అత్యధిక పతకాలు గెలిచిన బాక్సర్‌గా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు ఆసియా చాంపియన్‌షిప్‌ను గెలిచింది.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD