మేరీకోమ్‌కు ట్రయల్స్‌ లేవు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-17 06:03:04

  • ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌
  • బాక్సింగ్‌ సమాఖ్య వెల్లడి

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌లో పోటీపడేందుకు దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌, నిఖత్‌ జరీన్‌ మధ్య ట్రయల్‌ బౌట్‌ ఉండబోదని బాక్సింగ్‌ సమాఖ్య (బీఎ్‌ఫఐ) అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ వెల్లడించారు. ఈ క్వాలిఫయర్స్‌ చైనాలోని ఉహాన్‌లో వచ్చే ఫిబ్రవరి 3 నుంచి 14 వరకు జరగనున్నాయి. ఉహాన్‌ టోర్నీకి 51 కిలోల విభాగంలో 36 ఏళ్ల మేరీకోమ్‌నే ఎంపిక చేయాలని బీఎ్‌ఫఐ భావిస్తోందని ఆయన తెలిపారు. ఇటీవలి మహిళల వరల్డ్‌ చాంపియన్‌షి్‌పనకు.. మేరీకోమ్‌, నిఖత్‌ మధ్య ఆగస్టులో జరగాల్సిన ట్రయల్‌ మ్యాచ్‌ను ఆఖరి నిమిషంలో రద్దు చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇంకా సద్దుమణగకముందే ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు మేరీకోమ్‌నే పంపుతామని బాక్సింగ్‌ సమాఖ్య ప్రకటించడం గమనార్హం. మహిళల విభాగానికి సంబంధించి ప్రపంచ చాంపియన్‌షి్‌పలో స్వర్ణ, రజత పతకాలు సాధించిన వారినే ఉహాన్‌ పోటీలకు పంపాలని ఎంపిక కమిటీ నిబంధన విధించింది. అయితే, ఈ నిబంధనను మార్చే అవకాశాలున్నాయని కూడా అజయ్‌ సింగ్‌ తెలిపారు. వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో 69 కిలోల కేటగిరీలో వరుసగా రెండో కాంస్య పతకం గెలుపొందిన లవ్లీనా బొర్గాయిన్‌కు కూడా ఎంపిక పోటీల నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశముంది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ సెమీఫైనల్లో టర్కీ బాక్సర్‌ బుసెనాజ్‌ చేతిలో 1-4తో మేరీకోమ్‌ వివాదాస్పదరీతిలో ఓటమి పాలైన విషయం విదితమే. 51, 69 కిలోల విభాగాలు ఒలింపిక్‌ కేటగిరీలోనివి కావడం గమనార్హం.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD