మేరీతో నిఖత్‌ బౌట్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-10 03:26:13

img

  • వచ్చే నెలాఖరులో ట్రయల్స్‌

న్యూఢిల్లీ: భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌.. తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ మధ్య రాజుకున్న టోక్యో ఒలింపిక్స్‌ ట్రయల్స్‌ వివాదానికి బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ముగింపు పలికింది. శనివారం స్పోర్ట్స్‌ హై పెర్ఫార్మెన్స్‌ డైరెక్టర్‌ శాంటియాగో నీవా మాట్లాడుతూ.. మహిళల బాక్సింగ్‌లో ఐదు కేటగిరీలకు ట్రయల్స్‌ నిర్వహిస్తున్నామన్నారు. ‘వచ్చే నెలాఖరులో ట్రయల్స్‌ ఉంటాయి. విజేతలుగా నిలిచిన వారు ఫిబ్రవరిలో చైనాలో జరిగే ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌లో పాల్గొంటారు. బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ గత ఆగస్టులో తీసుకున్న నిర్ణయం మేరకు వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో పసిడి, రజత పతకాలు సాధించిన వారికి మినహా మిగిలిన అందరికీ ట్రయల్స్‌ నిర్వహిస్తాం’ అని శాంటియాగో చెప్పారు. దీంతో 51 కిలోల విభాగంలో మేరీకోమ్‌తో నిఖత్‌కు తలపడే అవకాశం లభించింది. తొలుత రష్యాలో ముగిసిన వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప అనంతరం మేరీకోమ్‌ను ట్రయల్స్‌ లేకుండా ఒలింపిక్స్‌కు ఎంపిక చేస్తున్నట్టు ఫెడరేషన్‌ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని నిఖత్‌ తప్పు పట్టడంతో పాటు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు దృష్టికి తీసుకెళ్లడం..ఆమెకు పలువురు క్రీడాకారులు మద్దతు పలకడంతో బాక్సింగ్‌ ఫెడరేషన్‌ దిగిరాక తప్పలేదు. ఇక, పురుషుల విభాగంలో అమిత్‌ పంగల్‌ (52 కి.), మనీష్‌ కౌషిక్‌ (63 కి.) తప్ప మిగిలిన బాక్సర్లు ట్రయల్స్‌లో పాల్గొననున్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN