మైదానంలో వాంతులు చేసుకున్న బంగ్లా క్రికెటర్లు

Nava Telangana

Nava Telangana

Author 2019-11-06 15:59:00

న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం టీమిండియాతో జరిగిన మొదటి టి20 మ్యాచ్‌లో ఇద్దరు బంగ్లాదేశ్‌ క్రికెటర్లు ఇబ్బంది పడినట్టు వెల్లడైంది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరైన బంగ్లా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సౌమ్య సర్కార్‌, మరో ఆటగాడు వాంతులు చేసుకున్నట్టు ఈఎస్‌పీఎన్‌ వెల్లడించింది. ఆందోళనలు పట్టించుకోకుండా ఢిల్లీలో మ్యాచ్‌ నిర్వహించడంతో బీసీసీఐపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరినప్పటికీ బీసీసీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో రద్దు చేయడం కుదరదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తేల్చిచెప్పారు. కాలుష్యాన్ని లెక్కచేయకుండా క్లిష్ట పరిస్థితుల్లో ఆడిన రెండు జట్లను మ్యాచ్‌ ముగిసిన తర్వాత ట్విటర్‌ ద్వారా ఆయన అభినందించారు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN