మోదీ తర్వాత ధోనీయే!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-26 06:26:13

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తర్వాత దేశ ప్రజలు అభిమానించేది ఎవరినో తెలుసా? టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీని. అవును.. బ్రిటన్‌కు చెందిన మార్కెటింగ్‌ పరిశోధన సంస్థ యుగోవ్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 41 దేశాల్లోని 42 వేలమందిని ఆ సంస్థ సర్వేలో భాగస్వాములను చేసింది. పురుషులు, మహిళల విభాగాల్లో వేర్వేరుగా సర్వే చేసింది. భారత్‌కు సంబంధించి ప్రధాని మోదీ (15.66 శాతం) అగ్రస్థానంలో నిలవగా, ధోనీ (8.58) ఆ తర్వాతి స్థానం దక్కించుకున్నాడు. భారత మహిళల్లో దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ (10.36) టాప్‌లో నిలిచింది. క్రీడాకారుల జాబితాలో మహీ తర్వాత సచిన్‌ (5.81), కోహ్లీ (4.46), క్రిస్టియానో రొనాల్డో (2.95), లియోనల్‌ మెస్సీ (2.32) ఉండడం గమనార్హం.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN