మోదీ తర్వాత మహీ

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-26 03:14:00

img
న్యూఢిల్లీ : క్రికెట్‌కు కొంతకాలంగా దూరంగా ఉన్నా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అభిమానుగణం మాత్రం తగ్గలేదు. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్న మహీ.. రిటైరవుతాడంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా అతడి పాపులారిటీ మాత్రం పెరుగుతూనే ఉందని ఓ సర్వే వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ(15.66 శాతం) తర్వాత దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తిగా ధోనీ(8.58శాతం) నిలిచాడు. ప్రముఖ ప్రజాభిప్రాయ సేకరణ సంస్థ యూగోవ్ ఓ సర్వే ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ధోనీ తర్వాతి స్థానంలో ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా(8.02శాతం) ఉన్నారు. విరాట్ కోహ్లీ(4.46శాతం) ఎనిమిదో స్థానంలో ఉండడం విశేషం. మహిళల విభాగంలో మేరీకోమ్ అగ్రస్థానంలో ఉన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN